ఒంటరి వృద్ధురాలి ఇంట్లో చోరీ..40 తులాల బంగారం,రూ.8 లక్షల మాయం

ఒంటరి వృద్ధురాలి ఇంట్లో చోరీ..40 తులాల బంగారం,రూ.8 లక్షల మాయం
  • కేర్  టేకర్ పై కుటుంబ సభ్యుల అనుమానం, అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్  కాలనీలో సోమవారం భారీ చోరీ జరిగింది. ఓ వృద్ధురాలి ఇంట్లో నుంచి 40 తులాల బంగారు బిస్కెట్లు, రూ.8 లక్షల నగదు మాయమయ్యాయి. ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో ఈ చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ చోరీ వెనుక వృద్ధురాలి దగ్గర కేర్  టేకర్​గా పని చేస్తున్న కరీమా బేగంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

మూడు నెలలుగా కేర్  టేకర్ గా పని చేస్తున్న మహిళపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట టౌన్​ పోలీసులు అనుమానితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. క్లూస్  టీమ్, డాగ్  స్క్వాడ్ తో పోలీసులు ఇంట్లో, పరిసర ప్రాంతాల్లోనూ ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.