ప్లంబింగ్​ పనిచేస్తూ.. ఇంటికి కన్నం

ప్లంబింగ్​ పనిచేస్తూ.. ఇంటికి కన్నం

కొమురవెల్లి, వెలుగు: మండల కేంద్రంలో గత శనివారం భారీ చోరీ చేసిన నిందితుడిని పోలీసులు రెండు రోజుల్లోనే పట్టుకున్నారు. సోమవారం పోలీస్ స్టేషన్​లో చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. అంబడిపల్లిలోని అర్చన నాగరాజు ఇంట్లో కొద్ది రోజులుగా ప్లంబింగ్ వర్క్​చేస్తున్న అదే గ్రామానికి చెందిన మల్లేశం ఓనర్​విహార యాత్రకు వెళ్లడంతో ఈనెల 22న మధ్యాహ్నం ఇంటిపై పెంట్​హౌస్​తాళాలను పగులగొట్టి చొరబడి 32 తులాల గోల్డ్, 23తులాల వెండి నగలు, రూ.లక్షా17వేల నగదును ఎత్తుకెళ్లాడు.

విషయం తెలుసుకున్న అర్చన ఎస్సై చంద్రమోహన్​కు ఫిర్యాదు చేసింది. దీంతో సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేశారు. సోమవారం కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో నిందితుడు ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనం ఒప్పుకొని గోల్డ్, వెండి, నగదును అప్పగించినట్లు సీఐ తెలిపారు. కేసులో ఎస్సై,  సిబ్బందిని సీఐ అభినందించారు.