భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ల ధరలు

భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ల ధరలు
  • 19కేజీల సిలిండర్ ధర రూ.105, 5 కేజీల సిలిండర్ ధర రూ.27 పెంపు
  • ఢిల్లీలో 2వేలు దాటిన కమర్షియల్ సిలిండర్ ధర
  • గృహావసరాల సిలిండర్ల ధరలు యధాతథం

న్యూఢిల్లీ: వాణిజ్య సిలిండర్లు వాడే హోటళ్లు, రెస్టారెంట్లు, చిరుతిండ్ల తోపుడు బండ్ల నిర్వాహకులకు చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. మార్చి 1వ తేదీ నుంచి కమర్షియల్ సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. 19కేజీల సిలిండర్ ధర రూ.105 పెంచగా 5 కేజీల సిలిండర్ ధర రూ.27 పెంచాయి. తాజా పెంపుతో వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో 2వేలు దాటింది. కొత్త ధరలు మంగళవారం మార్చి 1వ తేదీ నుంచే అమలులోకి తెచ్చాయి. 
గత ఫిబ్రవరిలో కమర్షియల్ సిలిండర్ల ధరను రూ.91.50 తగ్గించిన చమురు సంస్థలు నెల రోజుల తర్వాత రూ.105 పెంచేశాయి. 
తాజా ధరల పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,012కు చేరగా.. ముంబైలో రూ.1,962కి పెరిగింది. అలాగే  కోల్ కతాలో రూ.2,089కి, చెన్నైలో రూ.2,185కి చేరుకుంది. అలాగే 5కిలోల కమర్షిల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.569కి చేరింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధ ప్రభావంతో ఒకవైపు వరుసగా అన్ని ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంతో బయట ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. 
గృహావసరాల గ్యాస్ సిలిండర్ల ధరలు యధాతథం
పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకున్నాయి చమురు సంస్థలు. ఒకవైపు అన్ని ధరలు పెరుగుతున్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సామాన్యుడిపై భారం పడకుండా గృహావసరాల సిలిండర్ల ధరలు పెంపు నుండి మినహాయింపు కల్పించాయి. ప్రస్తుతం గృహావసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.899.50 ఉండగా.. కోల్ కతాలో రూ.926, ముంబయిలో రూ.899.50, చెన్నైలో రూ.915.5గా ఉంది. 

ఇవి కూడా చదవండి

సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం

‘కచ్చా బాదామ్’ సింగర్‌కు యాక్సిడెంట్

నాలుగు రోజులుగా బంకర్ లోనే..