సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం

సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. సత్య, అనుపమ దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల (26) చిన్న వయసులోనే కన్నుమూశాడు. మెదడుకు సంబంధించిన పక్షవాతంతో పుట్టినప్పటి నుంచి బాధపడుతున్న జైన్.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. జైన్ మరణించిన విషయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ కు తెలియజేస్తూ మెయిల్ చేసిందని తెలుస్తోంది. ఇలాంటి బాధాకర సమయంలో సత్య నాదెళ్లకు కొంత ప్రైవసీని ఇవ్వాలని ఉద్యోగులను కంపెనీ కోరింది. జైన్ మృతికి విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపింది. కాగా, సత్య అను దంపతులకు జైన్ తోపాటు దివ్య, తార అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

అవన్నీ రూమర్స్.. నా పెళ్లికి ఇంకా టైమ్ ఉంది

ఆకట్టుకుంటున్న శంకరుడి సైకత శిల్పం

నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం