
హైదరాబాద్, వెలుగు: మాస్టర్స్ గేమ్స్ తెలంగాణ స్టేట్ చాంపియన్‌షిప్ ఈ నెల 6న సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరగనుంది. ఈ టోర్నీలో 30 ప్లస్ నుంచి 90 ప్లస్ ఏజ్ గ్రూప్ వరకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తారు. 100 మీ, 200 మీ, 400 మీ ఈవెంట్లతో పాటు షార్ట్‌పుట్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో తదితర పోటీలు ఉంటాయని ఆర్గనైజర్స్ తెలిపారు.
30 నుంచి 60 ప్లస్ ఏజ్ గ్రూప్‌లో మెన్స్ ఫుట్‌బాల్ పోటీలు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ టోర్నీకి సంబంధించిన జెర్సీని మాస్టర్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ కె. రామ్ రెడ్డి , సెక్రటరీ రామా రావుతో కలిసి మంగళవారం రిలీజ్ చేశారు. కార్యక్రమంలో భాస్కర్ రావు, డుగ్లాస్ బెర్నార్డ్, రత్నాకర్ రావు పాల్గొన్నారు.