మున్సిపాలిటీల్లో కొలిక్కిరాని ప్లాన్‌‌‌‌‌‌‌‌ అమలు

మున్సిపాలిటీల్లో కొలిక్కిరాని ప్లాన్‌‌‌‌‌‌‌‌ అమలు
  • రాజకీయ ఒత్తిళ్లు, జోన్ల విషయంలో అభ్యంతరాలు
  • ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని సర్వే

నల్గొండ, వెలుగు: మున్సిపాలిటీల్లో మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ అమలు అడుగు కూడా ముందుకు పడడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, జోన్ల విషయంలో వస్తున్న అభ్యంతరాలు ఆఫీసర్లకు సవాల్‌‌‌‌‌‌‌‌గా మారుతున్నాయి. దీంతో ఏళ్లు గడుస్తున్నా డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ పబ్లికేషన్‌‌‌‌‌‌‌‌ దగ్గరే ఆగిపోతున్నారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రూపొందించాల్సి ఉండగా గ్రేడ్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలైన నల్గొండ, మిర్యాలగూడ లాంటి చోట్ల కూడా కొలిక్కి రావడం లేదు. ఇక కొత్త మున్సిపాలిటీల్లో మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌పై అవగాహన లేకపోవడం, టౌన్‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది కొరత ఉండడంతో ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేదు. మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రూపొందించే బాధ్యతను ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌కు అప్పగించారు. ఏజెన్సీలు, మున్సిపాలిటీల్లోని టౌన్‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు కలిసి మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రూపొందించాల్సి ఉంటుంది. పట్టణాల్లో తాజా పరిస్థితులను అధ్యయనం చేసి, జోన్ల వారీగా పట్టణాన్ని విభజించి ప్లాన్‌‌‌‌‌‌‌‌ రెడీ చేస్తారు. రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌, ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌, కమర్షియల్‌‌‌‌‌‌‌‌, ఎడ్యుకేషనల్‌‌‌‌‌‌‌‌, గ్రీన్‌‌‌‌‌‌‌‌, మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌, అర్బనైజబుల్‌‌‌‌‌‌‌‌, బఫర్‌‌‌‌‌‌‌‌ జోన్ల వారీగా విభజించి ఏరియా అలాట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు.

అభ్యంతరాలు చెబుతున్న పాలకవర్గాలు

నల్గొండ పట్టణంలో 1987 నాటి మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లానే ఇంకా అమలవుతోంది. దీని ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా ప్రతి 20 ఏళ్లకోసారి మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ మార్పు జరగాలి. కానీ నల్గొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలను గ్రేడ్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ స్థాయికి పెంచారే తప్ప మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ మాత్రం ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయారు. మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌పైన పాలకవర్గాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఆఫీసర్లకు తలనొప్పిగా మారాయి. మరోవైపు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ దశలోనే ప్లాన్‌‌‌‌‌‌‌‌కు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పడుతోంది. ప్రధానంగా మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌, అర్బనైజబుల్‌‌‌‌‌‌‌‌, ఇండ్రస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ జోన్ల విషయంలో వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌, అర్బనైజబుల్‌‌‌‌‌‌‌‌లో రైతుల భూములు కూడా ఉండడంతో ప్లాన్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేయలేకపోతున్నామని ఆఫీసర్లు అంటున్నారు.  

జోన్ల విషయంలో సమస్యలు

మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌కు జోన్ల విషయంలోనే ప్రధాన సమస్య ఎదరువుతోందని ఆఫీసర్లు అంటున్నారు. నల్గొండలో 1987లో గుర్తించిన ఇండ్రస్టియల్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ను కొత్త ప్లాన్‌‌‌‌‌‌‌‌లో తొలగించాలని అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయి. పబ్లిష్‌‌‌‌‌‌‌‌ చేసిన డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌పైన వచ్చిన అభ్యంతరాల కంటే రాజకీయంగా వస్తున్న ఒత్తిళ్లే ఎక్కువగా ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం పట్టణాల్లో స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి టౌన్‌‌‌‌‌‌‌‌లో కనీసం 10 శాతం ల్యాండ్‌‌‌‌‌‌‌‌ను ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌కు కేటాయించారు. కొత్త అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ఏరియాను అర్బనైజబుల్‌‌‌‌‌‌‌‌ ఏరియాగా గుర్తించాలని, కొన్ని చోట్ల మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ జోన్లు కూడా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దేవరకొండ మున్సిపాలిటీ పూర్తిగా గుట్టల ప్రాంతం, ట్రైబల్ ఏరియా కావడంతో అక్కడ ఇండ్రస్ట్రియల్‌‌‌‌‌‌‌‌, కమర్షియల్‌‌‌‌‌‌‌‌ జోన్లన గుర్తించడంలో సమస్య వస్తోంది. రెండేళ్లు గడుస్తున్నా దేవరకొండ ప్లాన్‌‌‌‌‌‌‌‌ విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మిర్యాలగూడలో డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. అక్కడి నుంచి వచ్చాక ప్రజల నుంచి మరోసారి అభ్యంతరాలు తీసుకోవాల్సి ఉంది. 

కొత్త మున్సిపాలిటీల్లో వ్యతిరేకత

చండూరు మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ను హైస్కూల్‌‌‌‌‌‌‌‌ ఆవరణలో నిర్మించాలని అనుకున్నారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దానిని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి మార్చారు. మున్సిపాలిటీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణంలోనూ అభ్యంతరాలు రావడంతో మరో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు చేంజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. చిట్యాల మున్సిపాలిటీ లో కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు పట్టణాన్ని పరిశీలించినా డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ రూపొందించలేదు. హాలియాలో కూడా ఇంచు మించు ఇదే పరిస్థితి నెలకొంది. నందికొండలో పూర్తిగా ఎన్సెస్పీ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నందున మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రూపకల్పనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.