Summer Holidays: 90’s సిరీస్‌ రోహన్ నుంచి క్రేజీ ఎంటర్టైనర్‌.. చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలీడేస్’..

Summer Holidays: 90’s సిరీస్‌ రోహన్ నుంచి క్రేజీ ఎంటర్టైనర్‌.. చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలీడేస్’..

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని.. అంటూ ‘90’s మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్‌‌‌‌తో బాలనటుడిగా ఆకట్టుకున్నాడు మాస్టర్ రోహన్. తనదైన కామెడీ టైమింగ్‌‌‌‌తో వరుస చిత్రాలతో మెప్పిస్తున్న ఈ చైల్డ్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌ త్వరలో ‘సమ్మర్‌‌‌‌‌‌‌‌ హాలీడేస్‌‌‌‌’ అనే బాలల చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

తనతో పాటు ‘35 చిన్న కథ కాదు’ ఫేమ్ మాస్టర్ అరుణ్ ఇందులో మరో లీడ్‌‌‌‌గా నటించాడు. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా రోహన్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో ఈ సినిమా వస్తోందని, త్వరలోనే థియేటర్స్‌‌‌‌లో రిలీజ్ చేయబోతున్నామని ఈ సందర్భంగా మేకర్స్‌‌‌‌ తెలియజేశారు.