ఎప్పటికప్పుడు కొత్త జానర్స్ ప్రయత్నించే వరుణ్ తేజ్.. ఈసారి ‘మట్కా’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత వరుణ్ నటిస్తున్న పూర్తి స్థాయి మాస్ సినిమా ఇది. కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నలభై రోజుల పాటు జరిగే ఈ లెంగ్తీ షెడ్యూల్ కోసం ఆర్ఎఫ్సీలో మ్యాసివ్ సెట్‌ను నిర్మించారు. లీడ్ యాక్టర్స్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి షూటింగ్లో జాయిన్ అయ్యారు.
‘175 రోజుల తర్వాత.. కొత్త ఎనర్జీ, ఆశలతో లైఫ్‌కు రెట్రో మ్యాజిక్ ఇచ్చేందుకు ‘మట్కా’ సెట్స్‌లోకి తిరిగొచ్చా’ అంటూ వింటేజ్ టెలిఫోన్‌ను పట్టుకున్న ఫొటోను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వరుణ్ తేజ్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ నాలుగు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నాడు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి. రవి శంకర్ ఈ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. డా.విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.