హైదరాబాద్ సిటీ/కొడంగల్/సికింద్రాబాద్, వెలుగు : అందరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఉద్యోగులు, సిబ్బందికి మేయర్మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ నుంచి 3.10 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అడిషనల్ కమిషనర్ పంకజ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ పాల్గొన్నారు.
కొడంగల్ మున్సిపల్ చెర్మన్ జగదీశ్వర్‌రెడ్డి గురువారం సిటీలో డీజీపీ జితేందర్ ను కలిసి మట్టి గణపతిని అందజేశారు. సికింద్రాబాద్రాంగోపాల్ పేట డివిజన్ సోమసుందరం వీధి లో మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 మట్టి వినాయకులను పంపిణీ చేశారు. మహకాంళి ఏసీపీ సర్దార్ సింగ్ అతిథిగా పాల్గొన్నారు. మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా మట్టి వినాయకులు పంపిణీ చేయడం అభినందనీయన్నారు. హెచ్ఎండీఏ అధికారులు గురువారం సిటీలోని 33 ప్రాంతాల్లో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. శుక్రవారం కూడా పంపిణీ చేయనున్నారు.