సింగపూర్​ సదస్సుకు రావాలని ఆహ్వానం

సింగపూర్​ సదస్సుకు రావాలని ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: సింగపూర్​లో జూన్ 2 నుంచి 4 వరకు జరగనున్న తొమ్మిదో ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ఆహ్వానం అందింది. సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ గురువారం హెడ్డాఫీసులో మేయర్ ను కలిసి ఆహ్వానించారు.

.లివబుల్ అండ్ సస్టైనబుల్​సిటీస్, రిజివేనేట్, రీఇన్వెంట్, రీ ఇమేజిన్ అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. ఈ సందర్భంగా మేయర్​ విజయలక్ష్మి హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో వైస్  కౌన్సిల్ మిస్ నికొల్ చెన్ తదితరులు పాల్గొన్నారు.