కుంగిన నాలా పనులు చేయండి: అధికారులకు మేయర్ ఆదేశాలు

కుంగిన నాలా పనులు చేయండి: అధికారులకు మేయర్ ఆదేశాలు
  •   జూబ్లీహిల్స్ లో మేయర్ పర్యటన

హైదరాబాద్ సిటీ, వెలుగు: బస్తీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యర్థాల తొలగింపులో నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం జూబ్లీ హిల్స్‌లోని అంబేద్కర్ నగర్, ఉదయ్ నగర్ బస్తీల్లో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి ఆమె పర్యటించారు. 

అంబేద్కర్ నగర్​లో కూలిన నాలా రిటైనింగ్ వాల్ వద్ద ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 1లో ఇటీవల స్లాబ్ కుంగిన ప్రదేశంలో నాలా పనులు వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మేయర్ వెంట చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఉన్నారు.