జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై 16 మందితో కో ఆర్డినేషన్ కమిటీ..చైర్పర్సన్గా మేయర్ విజయలక్ష్మి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై 16 మందితో కో ఆర్డినేషన్ కమిటీ..చైర్పర్సన్గా మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ 16 మంది పార్టీ నేతలతో కో ఆర్డినేషన్ కమిటీ నియమించింది. హైదరాబాద్​లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం మీడియాకు ఒక ప్రకటనలో కమిటీ వివరాలు వెల్లడించారు. 

చైర్​పర్సన్​గా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కో చైర్మన్​గా మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్​ను నియమించారు. మరో 14 మంది పార్టీ నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నిక సందర్భంగా మొత్తం 7 డివిజన్లలో ప్రచార బాధ్యతల్లో ఉన్న వారితో ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమన్వయం చేయనున్నది.