టెర్రరిస్టులపై యాక్షన్ తీసుకోండి లేదా అప్పగించండి..కెనడాకు ఇండియా వార్నింగ్..

టెర్రరిస్టులపై యాక్షన్ తీసుకోండి లేదా అప్పగించండి..కెనడాకు ఇండియా వార్నింగ్..

ఉగ్రవాదులకు సురక్షితమైన ఆశ్రయం కల్పిస్తుందని కెనడా ప్రభుత్వాన్ని భారత్ గురువారం తప్పుబట్టింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనాడా దేశాల మధ్య దౌత్య పరమైన వివాదం నెలకొంది. 

భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. ఇక్కడ పెద్ద సమస్య అంటే ఉగ్రవాదం, ఉగ్రవాదానికి నిధులు, విదేశాలలో ఉగ్రవాదులకు సురక్షితమైన ఆశ్రయం అని బాగ్చి అన్నారు. 

పొరుగు దేశమైన పాకిస్తాన్  ఉగ్రవాదానికి నిధులు, మద్దతు ఇస్తోంది.. దీంతో పాటు కెనడాతో సహా విదేశాలలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని బాగ్చీ తెలిపారు. 
కెనడా ప్రభుత్వం తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదు.. తీవ్రవాదం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి లేదా వారిని పంపించి వేయాలని కోరుతున్నామని అరిందమ్ బక్చీ అన్నారు.  

కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదులుగా  ఆరోపణలు ఉన్న  20- నుంచి 25 మంది వ్యక్తులను అప్పగించాలని భారత్ కోరిందని..అయితే కెనడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని బక్చి అన్నారు. 

2023 జూన్ 18న గురుద్వారా వెలుపల ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన ఖలిస్తానీ టైగర్ ఫోరర్స్ (కేటీఎఫ్) ఛీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్దిష్ట సమాచారం అందలేదని బాగ్చి చెప్పారు.