ఇంజినీరింగ్ ఉద్యోగం వదిలి సరస్సుల సంరక్షణ

ఇంజినీరింగ్ ఉద్యోగం వదిలి సరస్సుల సంరక్షణ

పేరు ఆనంద్ మల్లిగవాడ్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. మంచి ఉద్యోగం సంపాదించాడు. అయితే తాను చేస్తున్న పనిలో తనకు ఎక్కడా కూడా సంతృప్తి కనిపించలేదు. దీంతో ఉద్యోగాన్ని వదిలి... ప్రకృతి వైపు చూశాడు. మరణిస్తున్న సరస్సులకు ప్రాణం పోయాలనుకున్నాడు. ఇక అదే పనిలో నిమగ్నమయ్యాడు. వివరాల్లోకి  వెళ్తే.. కర్ణాటక బెంగళూరులో మరణిస్తున్న సరస్సులకు తిరిగి జీవం పోసేందుకు మెకానికల్ ఇంజనీర్ ఒకరు ముందుకు వచ్చాడు. అతడే ఆనంద్ మల్లిగవాడ్. రోజురోజుకు పెరుగుతున్న, వేగవంతమవుతున్న పట్టణీకరణ కారణంగా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా బెంగళూరు  నీటి వనరులను చాలా వరకు కోల్పోయింది. దీంతో తాను  నీటి వనరులు కాపాడే బాధ్యత తీసుకున్నానని ఆనంద్ చెెబుతున్నాడు. ఇప్పటివరకు  12 సరస్సులకు పునరుజ్జీవింపజేశానని ఆనంద్ తెలిపాడు. మరో రెండింటి పనులు పురోగతిలో ఉన్నాయన్నాడు. 

సరస్సుల సంరక్షణ కోసం తాను ఎంగానే స్టడీ చేశానని చెబుతున్నాడు ఈ మెకానికల్ ఇంజినీర్. సరస్సుల కోసం తెలుసుకునేందుకు ఒక సంవత్సరం పాటు, బెంగళూరులోని 180 సరస్సులను సందర్శించాడు. తక్కువ సమయం తీసుకునీ, తక్కువ ఖర్చుతో సరస్సుల సంరక్షణకు  స్థిరమైన మార్గాన్ని రూపొందించానని చెబుతున్నాడు ఆనంద్. ఇతరులు తన మోడల్‌ని తీసుకొని.. వారి పరిసరాల్లోని సరస్సులను పునరుద్ధరించడానికి సహాయం చేయాలని కోరాడు. ఆనంద్ చేస్తున్న పనిని పలువురు కొనియాడుతున్నారు. ప్రతీ ఒకరు ఇలా ఆలోచించి ముందు అడుగు వేస్తే.. దేశంలో ఎక్కడా కూడా నీటి కొరత రాదే అని చెబుతున్నారు. నెటిజన్స్ కూడా ఆనంద్ చేస్తున్న పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రేట్ జాబ్ అంటూ... శుభాకాంక్షలు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి:

ఇద్దరు లేడీ డాక్టర్ల పెళ్లి.. కారణం అదే

భారత్ లో కరోనా కలకలం...50వేలకు పైగా కేసులు