డబ్బు సంచులతో బీఆర్ఎస్ టికెట్ కొన్నడు : రఘునందన్ రావు

డబ్బు సంచులతో బీఆర్ఎస్ టికెట్ కొన్నడు : రఘునందన్ రావు
  •     మెదక్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు 

సిద్దిపేట రూరల్, వెలుగు : వెంకట్రామిరెడ్డి డబ్బు సంచులతో బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కొన్నాడని, ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ మారేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలకు తలా రూ. 10 కోట్లు ఇచ్చి పార్టీ మారకుండా ఆపాడని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ఆరోపించారు. గురువారం నారాయణరావుపేట మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మెదక్ లో ఎగిరేది బీజేపీ జెండానే అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రొటోకాల్ పాటించకుండా తనను అవమానించిన మాజీ మంత్రి హరీశ్ రావు కు

ఆ పార్టీ నాయకులకు నేడు సిద్దిపేటలో అదే అవమానం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఆయన ను కాదని అభివృద్ధి పనులకు కొబ్బరి కాయలు కొడుతున్నారన్నారు. మండలంలోని కార్యకర్తలు అందరూ బూతు స్థాయి నుంచి కష్టపడి ప్రతీ ఒక్కరిని కలుస్తూ బీజేపీకి ఓటు వేసేలా ప్రచారం చేయాలన్నారు. అనంతరం మండలంలోని పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు ఆయనకు మద్దతు తెలిపారు.

అంతకుముందు రూరల్ మండల పరిధిలోని రాఘవాపూర్ లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రమేశ్ గౌడ్, బీజైవైఎం జిల్లా అధ్యక్షుడు దినేశ్, భీషన్ రెడ్డి, బాబు పాల్గొన్నారు