సెకండ్ ఏఎన్ఎం  ఆత్మహత్యాయత్నం ..మెదక్ జిల్లా వెల్దుర్తి ఆస్పత్రిలో ఘటన

సెకండ్ ఏఎన్ఎం  ఆత్మహత్యాయత్నం ..మెదక్ జిల్లా వెల్దుర్తి ఆస్పత్రిలో ఘటన

వెల్దుర్తి, వెలుగు: మెదక్ జిల్లా కేంద్రంలోని వెల్దుర్తిలోని పీహెచ్‌‌‌‌సీ సెకండ్ ఏఎన్‌‌‌‌ఎం శుక్రవారం హాస్పిటల్‌‌‌‌లో టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న తోటి సిబ్బంది గమనించి వెంటనే మెదక్ పట్టణంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. డాక్టర్ల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు రజినీ తెలిపారు.

డాక్టర్లు సౌజన్య, శిరీష తనను దాదాపు రెండేళ్లుగా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితురాలు రజనీ తెలిపింది. ప్రస్తుతం ఆమె మెదక్ జీజీహెచ్ లో ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకుంటుండగా ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.