- నాలుగు తులాల బంగారంతో పరార్
మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో సోమవారం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. పింఛన్ డబ్బుల కోసం బ్యాంక్‌కు వెళ్తున్న వృద్ధురాలిపై దుండగుడు దాడి చేసి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. పట్టణంలోని రాంనగర్ కు చెందిన పోచమ్మ పింఛన్ డబ్బులు డ్రా చేసుకునేందుకు ఇంటి నుంచి మెయిన్ రోడ్డు మీద ఉన్న ఎస్బీఐ వరకు నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్ మీద వచ్చిన వ్యక్తి మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు.
బాధితురాలు లబోదిబోమంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధితురాలు మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
