ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం : రోహిత్​రావు

ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం : రోహిత్​రావు

పాపన్నపేట, వెలుగు: ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గురువారం మండలంలోని ఎల్లాపూర్ లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు. గత  ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను మోసం చేసిందన్నారు. వారికి దోచుకొని దాచుకోవడానికే సమయం సరిపోలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలు నేరవేర్చుతామన్నారు.

ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్​రాజర్షిషా మాట్లాడుతూ..  అర్హులైన ప్రజలందరూ పథకాలకు అప్లై చేసుకోవాలని తెలిపారు . నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ప్రత్యేకాధికారి జయరాజ్, ఎంపీపీ చందనారెడ్డి, ఎమ్మార్వో లక్ష్మణ్ బాబు, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేశ్​గుప్తా,  కోఆప్షన్ సభ్యుడు గౌస్, సర్పంచ్​ప్రభాకర్ రెడ్డి, పాపన్నపేట ఎంపీటీసీ శ్రీనివాస్​, నాయకులు ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంతప్ప, రమేశ్ గౌడ్, శ్రీనివాస్, సిరాజ్ ఉన్నారు. 

మెదక్​ టౌన్:  ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసమే గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు తెలిపారు. గురువారం మెదక్​ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలన సభల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్​చైర్మన్​చంద్రపాల్, వైస్​ చైర్మన్​ మల్లికార్జున్​గౌడ్​, కమిషనర్​జానకీ రాంసాగర్​, ఆయా వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

రామాయంపేట: పార్టీలకు అతీతంగా కలిసి కట్టుగా ఉండి రామాయంపేటను అభివృద్ధి చేసుకుందామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గురువారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై 57 మంది లబ్ది దారులకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.