మెదక్ టౌన్, వెలుగు: మెదక్ మున్సిపల్ పరిధిలోని అవుసులపల్లిలోని ఆలయాల్లోదొంగలు బీభత్సం సృష్టించిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. అవుసులపల్లిలోని మల్లన్న, ఎల్లమ్మ, పెద్దమ్మ ఆలయాల్లో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఉన్న హుండీలను పగలగొట్టడంతో పాటు విగ్రహాలను సైతం కొద్దిగా ధ్వంసం చేశారు. ఈ ఆలయాల్లో చోరీ విషయాన్ని తెలుసుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ జార్జ్, ఎస్సై లింగం పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
