మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రారంభం

మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రారంభం

మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో లెక్కింపు జరుగుతుంది.ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులు, పోలీసుల సమక్షంలో హుండీలు తెరుచుకున్నాయి. మొత్తం518 హుండీలలో ఉన్న కానుకలను 10 రోజుల పాటు లెక్కించనున్నారు. 

లెక్కింపులో  దేవాదాయ సిబ్బందితో పాటుగా స్వచ్ఛంద సంస్థలు, భక్తి మండలి సభ్యుల సేవలు వినియోగించుకోనున్నారు. పోలీసు పహారా,  సీసీ కెమెరాల నిఘా మద్య హుండీలు లెక్కింపు కొనసాగుతుంది.  ఒడి బియ్యం, కరెన్సీ, నాణేలు, బంగారం, వెండిని వేర్వేరుగా లెక్కించనున్నారు. 

ఈ నెల 21 నుంచి 24 వరకు సమ్మక్క, సారలమ్మ జాతర జరగగా మొత్తం 535 హుండీలను ఏర్పాటు చేశారు. ఇందులో సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద 215 చొప్పున, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెల వద్ద 26 చొప్పున హుండీలతోపాటు, మరో 30 క్లాత్‍ హుండీలను ఏర్పాటు చేశారు. మిగతావి తిరుగువారం కోసం పెట్టారు.