మేడారం జాతర పనులను ఇన్‌‌ టైంలో పూర్తి చేయాలి..మంత్రి సీతక్క ఆదేశం

మేడారం జాతర పనులను ఇన్‌‌ టైంలో పూర్తి చేయాలి..మంత్రి సీతక్క ఆదేశం

తాడ్వాయి, వెలుగు : వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం మహాజాతరకు సంబంధించిన పనులను ఇన్‌‌టైంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి పని క్వాలిటీగా ఉండాలని సూచించారు. 

జాతర ఏర్పాట్లకు సంబంధించిన పనులపై కలెక్టర్‌‌ దివాకర టీఎస్‌‌, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, మేడారం పూజారులు, వివిధ శాఖల ఆఫీసర్లతో కలిసి మేడారం ఐటీడీఏ గెస్ట్‌‌ హౌస్‌‌లో శుక్రవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్‌‌ ప్లాన్‌‌ రీ డెవలప్‌‌మెంట్‌‌ ప్లాన్‌‌ను, వివిధ పనులు ఏయే దశలో ఉన్నాయో ఆఫీసర్లు మంత్రికి వివరించారు. 

అనంతరం సీతక్క మాట్లాడుతూ అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయంతో పని చేసి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. గద్దెల ప్రాంగణం విస్తీర్ణం, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల స్థలం మార్పులు, క్యూ లైన్ల విస్తరణ, మీడియా పాయింట్‌‌ బిల్డింగ్‌‌, సీఎం గెస్ట్‌‌ హౌస్‌‌, పూజారుల వసతి గృహం వంటి నిర్మాణాలకు త్వరగా టెండర్లు పూర్తి చేయాలని చెప్పారు.

 భక్తులకు ఈజీగా దర్శనం కలిగేలా గద్దెలను వరుస క్రమంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో అడిషనల్‌‌ కలెక్టర్‌‌ సంపత్‌‌రావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఈవో వీరస్వామి పాల్గొన్నారు. అంతకుముందు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.