కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నిండిపోయిన వర్షపు నీరు

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నిండిపోయిన వర్షపు నీరు

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మున్సిపల్ పరిధిలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిస్థితి అద్వానంగా మారింది. వర్షపు నీరంతా బయటకు వెళ్లకుండా ఆసుపత్రి ఆవరణలో నిల్వ ఉంది. దీంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. సీజనల్ వ్యాధులు వస్తున్న తరుణంలో రోగులు, గర్భిణీలు ఆసుపత్రికి రావాలంటే జంకుతున్నారని చెబుతున్నారు. 

ALSO READ:హైదరాబాద్లో మరోసారి ఖగోళ అద్భుతం.. కొన్ని నిమిషాల పాటు నీడ మాయం

వర్షపు నీరంతా ఆసుపత్రి ఆవరణలో నిల్వ ఉండటంతో దోమలు, ఈగలు అధికంగా వస్తున్నామని రోగులు తెలిపారు. చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వాపోతున్నారు. పోస్ట్ మార్టం చేసే గది ముందు నీళ్లు పూర్తిగా నిండిపోవడంతో అందులోకి వెళ్లడానికి దారి లేకుండా పోయిందని సిబ్బంది తెలిపారు. దీంతో మృతదేహాలను గాంధీ మార్చురీకి పంపిస్తున్నారన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు ఆసుపత్రి ఆవరణలో ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలని కోరారు.