మాజీమంత్రి మల్లారెడ్డి గన్మ్యాన్ నిర్వాకం.. సిబ్బంది వారిస్తున్నా వెపన్ తో ఆలయంలోకి ప్రవేశం

మాజీమంత్రి మల్లారెడ్డి గన్మ్యాన్ నిర్వాకం.. సిబ్బంది వారిస్తున్నా వెపన్ తో ఆలయంలోకి ప్రవేశం

కొండగట్టు:  కొండగట్టు అంజన్నను మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి  దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అయితే అంతరాలయంలో స్వామి వారికి పూజలు చేస్తున్న సమయంలో మల్లారెడ్డి గన్ మ్యాన్ కూడా వెపన్ తో ఆలయంలోకి ప్రవేశించాడు. గమనించిన ఆలయ సిబ్బంది వారించారు. అయిన వినకుండా ఆయుధంతోనే అంతరాలయంలోనే ఉన్నారు.

నిబంధనల ప్రకారం ఆలయంలోకి ఆయుధంతో ప్రవేశించకూడదు. నిబంధనలు పాటించక పోవడంతో ఆలయ సిబ్బంది, భక్తులు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మల్లారెడ్డి  మాట్లాడుతూ యాభై రోజుల పాలనలో కాంగ్రెస్ యాభై రకాల వేషాలు వేసిందన్నారు.

భారత దేశంలో నే అతి పెద్ద అంజనేయ స్వామి గుడి కొండగట్టు అని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 16సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని అంజన్నకు మొక్కుకున్నట్లు తెలిపాడు.