గిరిజన గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టండి : రాజీ

గిరిజన గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టండి : రాజీ

భద్రాచలం, వెలుగు :  గిరిజన గ్రామాల్లో మెడికల్​ క్యాంపులు ఏర్పాటు చేసి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ టెస్టులు చేయాలని మినిస్టరీ ఆఫ్​ ట్రైబల్ వెల్ఫేర్​ గవర్నమెంట్ ఆఫ్​ ఇండియా డిప్యూటీ సెక్రటరీ డాక్టర్​ రాజీ ఆదేశించారు. మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్​ ఆఫీసు నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె రివ్యూ చేశారు. గిరిజనులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా చేస్తున్న యాక్షన్​ ప్లాన్​పై ఆమె సమీక్షించారు. తలసేమియా, సికిల్​సెల్​ లాంటివి వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ సోకుతున్నాయన్నారు. గిరిజన గ్రామాల్లో రక్తపరీక్షలు చేయాలన్నారు. 

దీనిపై వారికి అవగాహన కల్పించాలన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని వైద్యశాలల్లో డాక్టర్ల కొరత, గైనకాలజిస్టులు, ఫిజియోథెరపీ మిషన్లు, స్కానర్, ఎక్స్ రే, డిజిటల్​ సిటీ స్కాన్​ కొరత ఉందని ఏపీవో జనరల్ డేవిడ్​రాజ్​ డిప్యూటీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కాన్ఫరెన్స్ లో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్​ డా.రామకృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్​ రాము తదితరులు పాల్గొన్నారు.