సర్కార్ ఆస్పత్రిలో కలెక్టర్ కు వైద్య పరీక్షలు

సర్కార్ ఆస్పత్రిలో  కలెక్టర్ కు  వైద్య పరీక్షలు

ఆదిలాబాద్ జిల్లా జిల్లా కలెక్టర్ రాజర్షి షా సెప్టెంబర్ 8న రిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు.  నడిచేటపుడు  ఎడమ కాలు మడమ తిరగబడి నడవటం కష్టంగా మారడంతో  రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కాలుకు ఎక్స్ రే  తీయించుకున్నారు.  అనంతరం వైద్యుల సూచనల మేరకు రిమ్స్ లోనే ఎంఆర్ఎ పరీక్ష సైతం చేయించుకున్నారు.

 కాలిలో పార్శియల్ లిగుమెట్ ఇంజూరి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి చికిత్సలు చేశారు.  గతంలోనూ పలు మార్లు కలెక్టర్, ఆయన కుటుంబ సభ్యులు రిమ్స్ లో  వైద్య పరీక్షలు చేసుకుని  చికిత్సలు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్  రాజర్షి రిమ్స్ లో  అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట రిమ్స్ డైరెక్టర్ డాక్టర్  జైసింగ్ రాథోడ్,  రేడియాలజీ విభాగం హెచ్ డీఓ కల్యాణ్ రెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నరేందర్ బండారి, ఆర్ఎంఒ చంపత్ రావు ఉన్నారు.