
స్టేషన్ ఘన్‌పూర్, వెలుగు: స్టేషన్ ఘన్‌పూర్ పట్టణం శివునిపల్లిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జున రావు ఫస్ట్ ఎయిడ్ క్లీనిక్ లు, ఆప్టికల్స్, మందుల దుకాణాలు, రక్త పరీక్ష కేంద్రాలపై దాడులు నిర్వహించారు.
దాడుల్లో నిబంధనలు పాటించని విఘ్నేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్పై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లీనిక్ లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆయుర్వేద వైద్యం, మందుల షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.