
జమ్ము కశ్మీర్ నిట్ నుంచి విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లాపోవాలని ఆదేశించడంతో స్టూడెంట్స్ అందరూ సొంతూళ్ల బాట పడుతున్నారు. చాలా మంది విద్యార్థులకు ప్రయాణాల టెన్షన్ పట్టుకుంది. అమర్ నాథ్ యాత్రికులు తిరుగు ప్రయాణాల్లో ఉన్నారు. ఇప్పుడు నిట్ విద్యార్థులు కూడా సొంతూళ్లకు వెళ్లే టైంలో ప్రయాణాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
కశ్మీర్ నుంచి విద్యార్థులు, టూరిస్టులు, యాత్రికులు తిరుగు ప్రయాణాలతో బిజీగా ఉండడంతో ఫ్లైట్ ఛార్జీలు భారీగా పెరిగిపోయాయి. సాధారణంగా శ్రీనగర్ నుంచి ఢిల్లీకి టిక్కెట్ ధర 3 వేలు ఉంటుంది. ఇప్పుడీ అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో 10 వేల నుంచి 22 వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు. శ్రీనగర్ నుంచి జమ్ముకు కూడా… 16 వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అమృత్ సర్, చండీగఢ్, జైపూర్ కు కూడా 10 వేల నుంచి 19 వేల వరకు వసూలు చేస్తున్నాయి విమాన సంస్థలు. ఇవాళ అసలు టిక్కెట్లే లేవని సూచిస్తున్నాయి విమాన సంస్థల వెబ్ సైట్లు. యాత్రికులను వెంటనే తిరుగు ప్రయాణం కావాలని చెప్పిన ప్రభుత్వం… వారికి సరైన భద్రత కల్పించాలని మనీష్ తివారీ డిమాండ్ చేశారు.