ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు పూర్తి..

ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు పూర్తి..

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు ముగిశాయి. దీంతో మరికాసేపట్లో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు. ఈ సందర్భంగా  కవితను కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు ఈడీ అధికారులు. ఇక, కవిత కూడా తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రించనున్నట్లు తెలుస్తోంది. 

 మార్చి 15 తేదీ శుక్రవాం మధ్యాహ్నం హైదరాబాద్ లోని కవిత నివాసంలో మొదట ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. కవిత నివాసానికి చేరకుని కొంతసేపు సోదాలు చేసి ఆమెను విచారించింది. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు ఈడీ అధికారులు. దీంతో ఆమె నివాసానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, కేంద్ర బలగాలు అక్కడికి చేరుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. తర్వాత భారీ భద్రత నడుమ కవితను ఢీల్లీలోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు అధికారులు.