
- మేడిపల్లి సత్యం కామెంట్
- రేవంత్ రెడ్డిపై పిచ్చివాగుడు బంజేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ గజనీగా తయారయ్యాడని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై పదే పదే పిచ్చివాగుడు బంజేయాలని హెచ్చరించారు. శుక్రవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీపై మాట్లాడిన మాటలు విని మహేశ్వర్ రెడ్డికి మతి తప్పిందని, అందుకే రేవంత్ గురించి పిచ్చి విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డిసెంబర్‌లో సీఎం మారుతారంటూ ఆయన మాట్లాడటాన్ని సత్యం తప్పుపట్టారు.
ఈ డిసెంబర్ కాదు కాదా.. ఇంకో పది డిసెంబర్‌లు వచ్చినా సీఎంగా రేవంతే కొనసాగుతారని స్పష్టం చేశారు. బీజేపీ దాని మిత్రపక్షం బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి కుర్చీని ఇంచు కూడా కదపలేరని అన్నారు. ముందు బీజేపీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని హితవు పలికారు.