Meenakshi Chaudary: లక్ అంటే మీనాక్షిదే.. మరో స్టార్ హీరో మూవీలో బంపర్ ఆఫర్

Meenakshi Chaudary: లక్ అంటే మీనాక్షిదే.. మరో స్టార్ హీరో మూవీలో బంపర్ ఆఫర్

నిజంగా లక్ అంటే మీనాక్షి చౌదరీ(Meenakshi Chaudary)దే అని చెప్పాలి. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో వర్క్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినీ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తలపతితో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీ చేస్తోంది. మరోపక్క టాలీవుడ్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో మట్కా సినిమాలో నటిస్తోంది మీనాక్షి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అంతేకాకుండా.. తొలిప్రేమ ఫేమ్ దర్శకుడు వెంకీ అంట్లూరి తెరకెక్కిస్తున్న లకీ భాస్కర్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది మీనాక్షి.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు.. టాలీవుడ్ నుండి మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట ఈ బ్యూటీ. అది కూడా స్టార్ హీరో సినిమాలో. ఆ స్టార్ మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్. అవును.. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావుపూడితో ఏ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమాలో వెంకీకి జోడీగా మీనాక్షినూయి తీసుకోనున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ లక్ అంటే మీనాక్షిదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో ఇప్పటికే F2, F3 చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఎంతపెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న కొత్త సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా మీనాక్షికి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.