వరుణ్‌‌‌‌ తేజ్‌‌‌‌తో మీనాక్షి చౌదరి

వరుణ్‌‌‌‌ తేజ్‌‌‌‌తో మీనాక్షి చౌదరి

రెండేళ్ల క్రితం ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్‌‌‌‌కు పరిచయమైన మీనాక్షి చౌదరి.. వరుస సినిమాలతో తెలుగులో బిజీ అవుతోంది. తాజాగా వరుణ్‌‌‌‌ తేజ్‌‌‌‌కి జంటగా ఆమెను ఎంపిక చేశారు. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ డైరెక్షన్‌‌‌‌లో వరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 14వ చిత్రం.  మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. 

ఇందులో హీరోయిన్‌‌‌‌గా మీనాక్షి చౌదరిని ఫైనల్ చేశారు. 1960 బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ మూవీలో  మీనాక్షి పాత్ర కీలకంగా ఉండబోతోంది. నటనకు ప్రాధాన్యత గల పాత్రలో ఆమె కనిపించబోతోంది. టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్న ఈ సినిమాని జులై 27న హైదరాబాద్‌‌‌‌లో ప్రారంభించబోతున్నారు.