
టాలీవుడ్ హీరోయిన్స్ లో మీరా జాస్మిన్(Meera Jasmine) కు మంచి గుర్తింపు ఉంది. తను తెలుగులో యాక్ట్ చేసిన మూవీస్ తక్కువే అయినా అభిమానుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ గా యువ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
శ్రీవిష్ణు, హీరోయిన్ రీతూ వర్మ(Reethu Varma) ప్రధాన జంటగా నటిస్తున్న స్వాగ్(Swag) మూవీలో ఈ అమ్మడు నటిస్తున్నట్లు సమాచారం. నలభై ఏళ్ల వయసులో ఉన్న మీరా జాస్మిన్ స్లిమ్‌డ్‌గా మారి గ్లామర్‌గా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా ఫోటోషూట్‌ల నుండి ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఆమె మలయాళ చిత్రాలలో పాత్రలు చేయడం ప్రారంభించింది.
మీరా జాస్మిన్ 2013లో తెరకెక్కిన మోక్ష సినిమా తర్వాత తెలుగులో ఏ మూవీలో యాక్ట్ చేయలేదు. విమానం మూవీలో చేసింది గెస్ట్ రోల్ కావడంతో..అంత ఆఫర్స్ రాలేదు. కానీ సామజవరామన వంటి కామిక్ మూవీతో మంచి ఫామ్ లో ఉన్న హీరో శ్రీ విష్ణుతో హీరోయిన్ గా ఆఫర్ రావడంతో ఒకే చేసినట్టు తెలుస్తోంది.
మీరా జాస్మిన్ కెరీర్లో భద్ర,గుడుంబా శంకర్, గోరింటాకు వంటి చిత్రాలలో ప్రధాన కథానాయికగా నటించింది. ఇక కొంతకాలం గ్యాప్ ఇచ్చాక..ఇటీవల సోషల్ మీడియాలోనూ బోల్డ్ ఫొటో షూట్స్‌తో అభిమానులను ఫిదా చేస్తోంది. మీరా ఈ సినిమా తర్వాత తెలుగులో తిరిగి బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శ్రీవిష్ణు నటించిన రాజా రాజా చోరా మూవీ డైరెక్టర్ హసిత్ గోలీ(Hasith Goli) స్వాగ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. రాజా రాజా చోరా చిత్రానికి ఇది ప్రీక్వెల్ అని, ఈ చిత్రంలో శ్రీవిష్ణు మూడు గెటప్‌లలో కనిపిస్తారని సమాచారం. రాజా రాజా చోరా ఫస్ట్ కరోనా వేవ్ లో వచ్చి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు శ్రీవిష్ణుకి మంచి ఫలితాన్ని ఇచ్చింది.కాగా స్వాగ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మిస్తోంది.