Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్ గారు' ఫ్యాన్స్‌లో జోష్.. 'మీసాల పిల్ల'తో మెగాస్టార్ రొమాన్స్

Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్ గారు' ఫ్యాన్స్‌లో జోష్..  'మీసాల పిల్ల'తో మెగాస్టార్ రొమాన్స్

మెగాస్టార్ చిరంజీవి, లేడి సూపర్ స్టార్ నయనతార కలిసి నటిస్తున్న చిత్రం  'మన శంకర వరప్రసాద్ గారు' .  అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం.. మూవీ టీం  ప్రోమోను రిలీజ్ చేసింది. దసరా సందర్భంగా విడుదలైన 'మీసాల పిల్ల' ప్రోమో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ వైరల్ అవుతోంది.

'మీసాల పిల్ల' ప్రోమోతో మెగా జోష్!

 'మీసాల పిల్ల' పాట ప్రోమోను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హంగామా మొదలైంది.  సంక్రాంతి 2026కి విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  నిమిషం నిడివి ఉన్న ఈ ప్రోమో వీడియో చిరంజీవి, నయనతార మధ్య సరదా సంభాషణతో మొదలైంది. నయనతారపై చిరంజీవి సరదాగా 'మీసాల పిల్లా' అని పిలవడాన్ని, కోపంగా ఉన్న ఆమెకు చిరంజీవి వివరించడం ఈ సంభాషణలో కనిపిస్తుంది.  ఆ తర్వాత 'మీసాల పిల్ల' అంటూ సాంగ్ అభిమానులను రెట్టింపు ఉత్సాహాన్నిస్తోంది.

ALSO READ :  నా కుమార్తెకు 'నగ్న చిత్రాలు పంపమంటూ' మెసేజ్!

వింటేజ్ చిరంజీవి డాన్స్‌కు స్వాగతం!

ఈ పాట టీజర్ చూస్తుంటే, ఇందులో వింటేజ్ చిరంజీవిని, ఆయన ఐకానిక్ డాన్స్ మూమెంట్స్‌ను మళ్లీ చూసే అవకాశం దొరుకుతుందని తెలుస్తోంది. ఈ డ్యూయెట్ పాటను ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ అద్భుతంగా డిజైన్ చేసిన భారీ, ఉల్లాసభరితమైన సెట్‌లో చిత్రీకరించారు.ఈ సెట్‌ను తీర్చిదిద్దడం సినిమా స్థాయిని పెంచింది.

ముఖ్యంగా, ఈ 'మీసాల పిల్ల' పాట ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలో తన గానంతో దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించిన లెజెండరీ గాయకుడు ఉదిత్ నారాయణ్ చాలా కాలం తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు తిరిగి రావడం విశేషం. ఆయనతో పాటు గాయని శ్వేతా మోహన్ ఈ ఉల్లాసభరితమైన డ్యూయెట్‌కు తన సమకాలీన గానంతో కొత్త టచ్ ఇచ్చింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు.

బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి యుద్దం

ఇటీవలే ఈ చిత్రంలో నయనతార పాత్ర పేరును శశిరేఖగా రివీల్ చేశారు. దసరా సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. నయనతార లుక్ ఎంతో గ్రేస్‌ఫుల్‌గా, డీసెంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంక్రాంతి 2026 సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్‌ను ఎదుర్కోబోతోంది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్', విజయ్ నటిస్తున్న 'జన నాయగన్', అలాగే నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' చిత్రాలు కూడా అదే సీజన్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నాలుగు భారీ చిత్రాల మధ్య జరిగే పోటీ తెలుగు ప్రేక్షకులకు పండుగ ట్రీట్‌ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది..