ఈసారి ఇడువొద్దు .. ఆసీస్‌‌‌‌‌‌‌‌తో అంత ఈజీ కాదు..

ఈసారి ఇడువొద్దు .. ఆసీస్‌‌‌‌‌‌‌‌తో అంత ఈజీ కాదు..

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో తిరుగులేదు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఎదురులేదు. ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌లో సాటి లేదు. ఆడిన పది మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ జట్టుకు సవాలే లేదు. టీమిండియా మూడోసారి వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గి తీన్‌‌‌‌‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టేందుకు ఇంతకుమించిన సమయం మరోటి ఉండబోదు..!

 పుష్కరకాలం తర్వాత మెగా టోర్నీలో ఫైనల్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇండియా అదే ఊపులో  రేపు ఆస్ట్రేలియాను ఓడిస్తే చూడాలనికోట్లాది మంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు..! ఈసారి వరల్డ్ కప్పును అస్సలు ఇడువొద్దని ఆశిస్తున్నారు.! 

సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో అంచనాలను అందుకుంటూ టీమిండియా సెమీస్ గండాన్ని దాటి ఫైనల్లో అడుగు పెట్టింది. అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరాటలోనూ అదరగొడితే మూడోసారి కప్పు మనదే అవుతుంది. టీమిండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో తలపడడం ఇది రెండోసారి. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట సౌతాఫ్రికాలోని జొహనెస్‌‌‌‌‌‌‌‌బర్గ్ వేదికగా జరిగిన 2003 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఇరు జట్లూ టైటిల్ ఫైట్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడగా కంగారూ టీమ్ ఘన విజయం సాధించింది. 

ఆ ఓటమి ఇండియా క్రికెటర్లను, అభిమానులను చాన్నాళ్లు వెంటాడింది. గంగూలీ, ద్రవిడ్, శ్రీనాథ్​, జహీర్ వరల్డ్ కప్‌ అందుకోకుండానే కెరీర్‌‌ ముగించారు. 2015 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లోనూ ఇండియాను ఆసీసే ఓడించింది. ఈ ఓటములకు బదులు తీర్చుకునే చాన్స్ ఇన్నాళ్లకు టీమిండియా ముందుకొచ్చింది. వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ గెలిచిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా లెజెండ్స్‌‌‌‌‌‌‌‌ కపిల్ దేవ్‌‌‌‌‌‌‌‌, ధోనీ సరసన చేరే అవకాశం ఇప్పుడు కెప్టెన్‌  రోహిత్ శర్మను, వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ విన్నర్లుగా చరిత్రలో నిలిచిపోయే ఘనత అటగాళ్లను ఊరిస్తోంది. 

ఆసీస్‌‌‌‌‌‌‌‌తో అంత ఈజీ కాదు..

ప్లేయర్ల ఫామ్, టీమ్ జోరు, సొంతగడ్డపై అనుకూలతలు చూస్తుంటే  ఫైనల్లో ఇండియానే ఫేవరెట్. పైగా టోర్నీ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే ఆస్ట్రేలియాపై అలవోక విజయం సాధించింది. కానీ, ఫైనల్లో ఆసీస్‌‌‌‌‌‌‌‌ను పడగొట్టడం అంత ఈజీ కాబోదు. ఎందుకంటే కంగారూ టీమ్‌‌‌‌‌‌‌‌ ఐదుసార్లు వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గింది.  మెగా టోర్నీల్లో, ముఖ్యంగా నాకౌట్‌‌‌‌‌‌‌‌లో  ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌లో విజృంభిస్తుందా జట్టు. ఇండియా నాలుగోసారి ఫైనల్ చేరితే ఆసీస్ ఏకంగా ఎనిమిదోసారి ఫైనల్ కు వచ్చింది. 

ఇప్పటికి ఆడిన ఏడు ఫైనల్స్‌‌‌‌‌‌‌‌లో ఐదుసార్లు గెలిచింది. రెండు ఓటములతో టోర్నీని ప్రారంభించిన ఆసీస్ తర్వాత వరుసగా ఎనిమిది మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో నెగ్గడమే అందుకు నిదర్శనం. నరనరాన పోరాటతత్వం నిండిన కంగారూలు  ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. విజయం కోసం ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి రోహిత్‌‌‌‌‌‌‌‌సేన ఏ మాత్రం అజాగ్రత్తకు తావివ్వకుండా, ఆత్మవిశ్వాసంతో ఆడితే ఫలితం ఉంటుంది.  

సూర్య ప్రతాపానికి ఆఖరి చాన్స్‌‌‌‌‌‌‌‌

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌5 బ్యాటర్లు రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్ సత్తా చాటుతుండగా.. బౌలర్లంతా తమ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. అయితే, టోర్నీలో ఇప్పటిదాకా తన మార్కు చూపెట్టనిది ఒక్క సూర్యకుమార్ మాత్రమే. ఇప్పటిదాకా టాప్‌‌‌‌‌‌‌‌, మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెయిలై అతనిపై ఆధారపడే అవసరం రాలేదు.  టోర్నీలో తన ప్రతాపాన్ని చూపెట్టేందుకు అతనికిదే ఆఖరి చాన్స్‌‌‌‌‌‌‌‌ కానుంది..  ఇక, చివరి నిమిషంలో ఎవరికైన గాయం అయితే తప్ప ఇండియా విన్నింగ్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ను మార్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ లేదు. మోదీ స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఛేజింగ్‌‌‌‌‌‌‌‌ జట్టు ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. కాబట్టి టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడం కీలకం కానుంది.

ఆ ఫైనల్ .. చేదు జ్ఞాపకం

ఇండియా, ఆసీస్ ఇది వరకు 2003 వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌  ఫైనల్లో తలడ్డాయి.  కానీ, జొహనెస్‌‌‌‌‌‌‌‌బర్గ్ లో జరిగిన ఫైనల్ గంగూలీసేనకు చేదు జ్ఞాపకంగా మిగిలింది. రికీ పాంటింగ్ కెప్టెన్సీలోని ఆసీస్ తొలుత- 359/2 స్కోరు చేసింది. కెప్టెన్ పాంటింగ్ (140) సెంచరీతో కదం తొక్కాడు.  కొండంత టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 234 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది.​ సెహ్వాగ్ (82), రాహుల్ ద్రవిడ్ (47)  పోరాడినా మిగతా బ్యాటర్లంతా నిరాశ పరిచారు.   ఆ టోర్నీలో ఓ ఊపు ఊపి టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన సచిన్ టెండూల్కర్ 4 పరుగులకే ఔట్ కావడం జట్టును దెబ్బకొట్టింది.

ఆ సంప్రదాయం కొనసాగితే 

వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో  గత మూడు పర్యాయాలుగా ఓ సంప్రదాయం కొనసాగుతోంది.  టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన జట్టే విజేతగా నిలుస్తోంది. 2011లో ఇండియాలో జరిగిన టోర్నీలో ధోనీసేన కప్పు నెగ్గింది. 2015లో ఆతిథ్య ఆస్ట్రేలియా,  గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో హోమ్ టీమ్  ఇంగ్లండ్ విశ్వవిజేతలుగా నిలిచాయి.  1996లోనూ ఇండియా, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో కలిసి మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన శ్రీలంకనే విజేతగా నిలిచింది. కాకపోతే ఆ టోర్నీ ఫైనల్ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లోని లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగింది.  ఆతిథ్య జట్టే విజేతగా నిలిచే సంప్రదాయం ఈసారి కొనసాగుతుందేమో చూడాలి.