భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో జులై 9,10 తేదీల్లో ఆధార్ మెగా క్యాంప్స్ : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో జులై  9,10 తేదీల్లో ఆధార్ మెగా క్యాంప్స్  : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఈ నెల 9,10 తేదీల్లో మెగా ఆధార్​ క్యాంప్స్​ను నిర్వహించనున్నట్టు కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్​లో ఈ క్యాంపులుంటాయని పేర్కొన్నారు.

 ఆధార్​ కార్డులో తప్పులతో పాటు మొబైల్​ నెంబర్​, పుట్టిన తేదీవంటి వాటిని సవరించుకోవడంతో పాటు కొత్త సమాచారం జత చేయాలనుకునే వారు, ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.