మై డియర్ లావణ్య.. కోడలి సిరీస్పై మెగా మామ రివ్యూ

మై డియర్ లావణ్య.. కోడలి సిరీస్పై మెగా మామ రివ్యూ

మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) తన కోడలు లావణ్య(Lavanya) లేటెస్ట్ గా నటించిన వెబ్ సిరీస్ గురించి అద్భుతమైన రివ్యూ ఇచ్చాడు. కోడలు లావణ్యను మై డియర్ లావణ్య అని సంబోధిస్తూ.. సిరీస్ పై, కోడలు లావణ్యపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం లావణ్యపై నాగబాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాలను  ఒప్పించి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తరువాత లావణ్య సినిమాలు చేయడం మానేస్తుందని చాలా మంది అనుకున్నారు. కనే అనూహ్యంగా తన సినీ కెరీర్ ను కంటిన్యూ చేస్తున్నారు లావణ్య. పెళ్లి తరువాత ఆమె నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. 

బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్ లో రెండు భిన్నమైన పాత్రల్లో నటించారు లావణ్య. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా లావణ్య మామగారు నాగబాబు మిస్ పర్ఫెక్ట్ సిరీస్ చూశారట. అనంతరం సోషల్ మీడియా వేదికగాసిరీస్ పై తన రివ్యూ ఇచ్చారు. మై డియర్ లావణ్య నటించిన మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ఇప్పుడే చూశాను. చాలా బాగుంది. చాలా వినోదాత్మకంగా అనిపించింది. అందరు తప్పకుండా చూసే సిరీస్ ఇది. అంటూ రాసుకొచ్చారు.       ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.