డీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు.. 11వేల ఉద్యోగాలకు ఆరోజులు కీలకం

డీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు.. 11వేల ఉద్యోగాలకు ఆరోజులు కీలకం

తెలంగాణాలో వెలువడిని మెగా డీఎస్సీపై ఎంతోమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. 11వేల ఉపాద్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. DSC 2024 పరీక్షలు జులై 17  నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో టైం టేబుల్ పెట్టింది. ఇప్పటికే డీఎస్సీ దరఖాస్తు గడువును జూన్ 20 వరకు పొడిగించింది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చెల్లించి జూన్ 20 రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 

డీఎస్సీ కంటే ముందుగా టెట్ నిర్వహించాల్సిందే అని హైకోర్టు ఆదేశించగా.. అధికారులు ఉన్నపళంగా  టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు. 
ఖాళీల సంఖ్య: 11,062
సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT): 6,508 పోస్టులు
స్కూల్‌ అసిస్టెంట్‌: 2,629 పోస్టులు
లాంగ్వేజ్ పండిట్: 727 పోస్టులు
  పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయులు): 182 పోస్టులు
స్పెషల్ ఎడ్యుకేషన్  (స్కూల్ అసిస్టెంట్): 220 పోస్టులు
స్పెషల్ ఎడ్యుకేషన్  (ఎస్జీటీ) 796 పోస్టులు

ALSO READ :- ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు : రాధాకిషన్‌రావుకు 7 రోజుల పోలీసు కస్టడీ