
వైష్ణవ్ తేజ్(Vaisshnavtej), శ్రీలీల(Sreeleela) జంటగా తెరకెక్కిన మూవీ ఆదికేశవ(Aadikeshava). శ్రీకాంత్ ఎన్ రెడ్డి(Srikanthreddy) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ నవంబర్ 24 న థియేటర్లో రిలీజై మిక్స్డ్ టాక్తో రన్ అవుతుంది. కమర్షియల్ యాక్షన్ జోనర్లో..రొటీన్ ఫార్మాట్లో సినిమా ఉందంటూ ఆడియాన్స్ నుంచి విమర్శలు వస్తోన్నాయి. ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ నటనలో..మరింత స్కోప్ పెంచుకుంటే బాగుండు. భారీ యాక్షన్ సీన్స్ తో కూడుకున్న కథ అయ్యే సరికి వైష్ణవ్ కు సెట్ అవ్వలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉంచితే..ఆదికేశవ సినిమాకు మొదట వైష్ణవ్ తేజ్ కాకుండా మరో మెగా హీరో వరుణ్ తేజ్(Varuntej) ను దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నాడట డైరెక్టర్ శ్రీకాంత్. కానీ, వరుణ్ తేజ్ మాత్రం ఈ కథం సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అంతేకాకుండా వరుణ్ పెళ్లి సెట్టవ్వడం..మధ్యలో వేరే సినిమాలతో బిజీగా ఉండటం వంటి కారణాలతో పాటు..కథపై ఏదో చిన్న అనుమానంతో సైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ కథ పలువురు హీరోస్ దగ్గరికి వెళ్లగా..ఫైనల్ గా వైష్ణవ్ వరకు వచ్చి ఆగినట్లు తెలుస్తోంది. అందులోను ఈ సినిమాని బడా ప్రొడ్యూసర్ నాగవంశీ, త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య లాంటి పెద్ద బ్యానర్ కావడంతో వైష్ణవ్ కథను ఒప్పేసుకున్నట్లు సమాచారం.
ఏదేమైనా..ఆదికేశవ సినిమా ఈ వీకండ్ కలెక్షన్స్ తో పర్వాలేదనిపిస్తే మాత్రం..మరో వీకెండ్ వరకు సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. బ్యూటీ శ్రీలీలతో వైష్ణవ్ స్టెప్స్ అదిరిపోయేలా ఉన్నాయని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఈ సినిమాకు GV ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా..మలయాళ స్టార్ యాక్టర్ జోజు జార్జ్ (Joju George) విలన్ నటించాడు.