బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో ఆదివారం సింగరేణి సంస్థ, నోబెల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. శనివారం బెల్లంపల్లిలోని క్యాంప్‌ఆఫీస్‌లో సబ్‌కలెక్టర్ మనోజ్, మందమర్రి ఏరియా జనరల్మేనేజర్ రాధాకృష్ణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
జాబ్‌మేళాలో రాష్ట్రంలోని దాదాపు 70 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పారు. సుమారు 10 వేల మంది అభ్యర్థులు వస్తారని అంచనా వేస్తున్నామని, అందరికీ ఇక్కడే భోజన వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఏఎంసీ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపవర్మెంట్ ప్రాజెక్టు మేనేజర్ శోభన్‌బాబు, ఎస్వోటూ జీఎం విజయప్రసాద్, ఏసీపీ రవికుమార్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సెక్యూరిటీ ఆఫీసర్రవీందర్పాల్గొన్నారు.
