
- ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షణీయం
- ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి
ఖానాపూర్, వెలుగు: నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించడం హర్షణీయమని బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ చార్జి జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో మహా మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యేలు అనిల్‌జాదవ్, కోవ లక్ష్మి చీఫ్గెస్టులుగా హాజరై జాన్సన్ నాయక్ కలిసి జాబ్ మేళాను ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 67 ప్రముఖ కంపెనీల ప్రతినిధులను హర్షణీయమన్నారు. జాన్సన్ నాయక్ మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలో నిరంతరం జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరిక మేరకు ఈ నెల 22న ఇచ్చోడలో జాబ్ మేళాను నిర్వహిస్తామని తెలిపారు. ఈ జాబ్ మేళాకు మొత్తం 4500 మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 5216 మంది మేళాకు తరలి రాగా.. 850 మందికి వివిధ జాబ్లకు ఎంపికయ్యారు. వారికి నియామకపత్రాలు అందజేశారు. అదిలాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాంకిషన్ రెడ్డి, బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులు నల్లా శ్రీనివాస్, రాము నాయక్, రాజ గంగన్న, రాజు, ఖలీల్, ప్రదీప్, భరత్ చౌహాన్, ఇర్ఫాన్, నసీర్, శ్రావణ్, సుమిత్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.