జెండా ఎగరవేసిన క్లీంకార.. వైరల్ అవుతున్న ఫొటోస్

జెండా ఎగరవేసిన క్లీంకార.. వైరల్ అవుతున్న ఫొటోస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan), ఉపాసన(Upasana) దంపతులు ఈ మధ్యే తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఉపాసన. మెగా ప్రిన్సెస్(Mega princess) అని ముద్దిగా పిలుచుకుంటున్న ఆ పాపకు క్లీంకార(Klin Kaara) అని నామకరణం చేశారు. పాప పుట్టి రెండు నెలలు గడుస్తున్నా.. ఆమెను బయటకు మాత్రం చూపించలేదు. పాప ఎలా ఉందొ చూడటానికి మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

అయితే తాజాగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా.. చిన్నారి క్లీంకార చేతులతో జెండా ఎగుర వేయించారు ఆమె అమ్మమ్మ తాతయ్యలు. ఉపాసన తల్లి శోభన, తండ్రి అనిల్ కామినేని ఇద్దరూ కలిసి చిన్నారి క్లీంకార చేత జెండాను ఎగురవేయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉపాసన. ఈ ఫోటోలలో కూడా పాప ముఖాన్ని కొంతవరకు మాత్రమే కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోసిల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మెగా ఫ్యాన్స్ తగ సంబరపడుతున్నారు