మెగా ప్రిన్సెస్ రాకతో కొణిదెల వంశం శక్తివంతమైంది.. మంత్రి రోజా ట్వీట్

మెగా ప్రిన్సెస్ రాకతో కొణిదెల వంశం శక్తివంతమైంది.. మంత్రి రోజా ట్వీట్

రామ్ చరణ్-ఉపాసన దంపతులకి ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసేందే.'మెగా ప్రిన్సెస్'  రాకతో కొణిదెల కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. తాజాగా ఇదే విషయంపై మంత్రి రోజా రామ్ చరణ్,ఉపాసనకు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేసింది.

"తాత అయిన చిరంజీవిగారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎప్పుడూ యవ్వనంగా, శక్తివంతంగా ఉండే ఈ కుటుంబానికి సర్వశక్తిమంతుడైన భగవంతుడు మెగా ప్రిన్సెస్‌ రూపంలో ఆశీర్వాదాన్ని అందించాడు. రామ్‌చరణ్‌.. చిన్నప్పుడు నిన్ను నా చేతుల్లో హత్తుకున్న రోజులు నాకింకా గుర్తున్నాయి. ఇప్పుడు నీకు పాప పుట్టిందన్న వార్త విని చాలా సంతోషమేసింది. చిరంజీవి సర్‌, మీరు తాతయ్య అయినప్పటికీ.. మాకు మాత్రం మీరు ఎప్పటికీ హీరోనే! ఉపాసన.. మీ ఇంటి చిన్ని మహాలక్ష్మికి ఇవే నా ఆశీస్సులు' అంటూ ట్వీట్‌ చేసింది మంత్రి రోజా. ప్రస్తుతం రోజా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.