మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) 2026, మార్చి 27న తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్లు, పోస్టులతో చరణ్‌కు విషెస్ తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన కుమారుడు చరణ్ బాబుకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అరుదైన ఫొటోలను పంచుకున్నారు. అరుదైన ఫొటోస్ పంచుకుంటూ ఆశీర్వాదాలు అందించారు. లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచిన నీ ప్రయాణంపై గర్వంగా ఉందని చిరంజీవి తెలిపారు.
చిరంజీవి X వేదికగా స్పందిస్తూ భావోద్వేగంగా ఇలా రాశారు.. ‘‘చిన్నప్పుడు చేయి పట్టుకున్న క్షణాల నుంచి, ఈ రోజు లక్షల మంది అభిమానులకు ఆదర్శంగా ఎదిగిన నీ ప్రయాణం గర్వకారణమని తెలిపారు. సినిమా మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేయడం, కుటుంబ బాధ్యతల పట్ల నిబద్ధత, దేవుడిపై నమ్మకం, క్రమశిక్షణ, విలువలు.. ఇవన్నీ నీ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని అన్నారు.
ప్రతి సారి ఇవి చూసినప్పుడు నీపై అభిమానం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఇక దేవుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ ఎల్లప్పుడూ నీతో ఉండాలని, నీవు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ’’ రామ్ చరణ్‌కు చిరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి షేర్ చేసిన ఈ అరుదైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Charan Babu…❤️❤️❤️
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2026
From holding my hand as a child to becoming an inspiration to many today… You make me truly proud.
The way you balance cinema and personal life, your sense of responsibility towards family, your faith in God, discipline, and values… every time I see it, my… pic.twitter.com/MMg5fYYo3k
