Megastar: చిరంజీవి 'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ అప్డేట్: బుల్లిరాజు స్టైల్‌లో వచ్చేస్తోంది!

Megastar: చిరంజీవి 'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ అప్డేట్: బుల్లిరాజు స్టైల్‌లో వచ్చేస్తోంది!

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార కలిసి నటిస్తున్న చిత్రం 'మన శంకర వర ప్రసాద్' . చాలా కాలం తర్వాత తమ అభిమాన నటుడు 'వింటేజ్ లుక్'లో కనిపించబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ  సినిమా అనిల్ రావిపూడి దర్వకత్వంలో తెరకెక్కుతోంది.  సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వరుసగా అప్‌డేట్‌లు, ప్రమోషనల్ కంటెంట్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

బుల్లిరాజు స్టైల్..

ఇటీవల దసరా సంర్భంగా విడుదలైన 'మీసాల పిల్ల' సాంగ్ ప్రోమో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ ట్యూన్, చిరంజీవి ఎనర్జిటిక్ డ్యాన్స్ బిట్స్ చూసిన ఫ్యాన్స్, పూర్తి పాట కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే, అనిల్ రావిపూడి తనదైన వినూత్న శైలిలో ఫుల్ సాంగ్ అప్‌డేట్‌ను విడుదల చేశారు.

ఈ అప్‌డేట్ కోసం చిత్రబృందం మరోసారి చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజును ఉపయోగించుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ పక్కన పడుకున్న బుల్లిరాజు మీసాల సాంగ్ ఫుల్ అప్‌డేట్ ఎప్పుడండీ..  ఇక్కడ నన్ను దొబ్బుతున్నారు అంటూ ఫ్యాన్స్ తరపున  గోల పెడతాడు. దానికి సమాధానం చెప్పలేక భీమ్స్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని అడగమంటాడు.

ఫుల్ సాంగ్ అప్డేట్

వెంటనే బుల్లిరాజును  డైరెక్టర్ దగ్గరకు వెళ్లి అడుగుతాడు.. దీనికి అనిల్.. నీవు చిరంజీవి గారి డ్యాన్స్ ను నువ్వు ప్రాక్టీస్‌ను చేయ్.. అప్పుడు అప్‌డేట్ తెలిసిపోతుంది అని అనిల్ రావిపూడి అంటాడు. దీంతో బుల్లిరాజు, మెగాస్టార్ డ్యాన్స్ స్టెప్పులను తనదైన మాస్ స్టైల్‌లో వేస్తూ... 'అక్టోబర్ 13, సోమవారం' అని ఫుల్ సాంగ్ విడుదల తేదీని అప్‌డేట్ ఇచ్చాడు. అంటే ఈ సోమవారం రోజున అభిమానులంతా 'మీసాల పిల్ల' పూర్తి పాటను వినబోతున్నారన్నమాట.

►ALSO READ | ARI Movie Review: ‘అరి’ మూవీ రివ్యూ.. డైరెక్టర్ జయ శంకర్ వినూత్న ప్రయత్నం ఫలించిందా?

వింటేజ్ లుక్..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత పవర్‌ఫుల్ వింటేజ్ లుక్ లో, యంగ్ ఏజ్‌లో ఎలా అయితే మాస్‌ను ఆకట్టుకున్నారో అదే తరహాలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, సినిమా కథనం కూడా అనిల్ రావిపూడి మార్క్‌తో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.  ఈ మాస్ బ్లాక్‌బస్టర్ సినిమా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు..