మెగాస్టార్ బ్రహ్మయుగం మొదలు.. డార్క్‌ షేడ్స్‌లో ఇంటెన్సివ్ పోస్టర్​ రిలీజ్

మెగాస్టార్ బ్రహ్మయుగం మొదలు.. డార్క్‌ షేడ్స్‌లో ఇంటెన్సివ్ పోస్టర్​ రిలీజ్

మెగాస్టార్ మమ్ముట్టి(Mammotty) బేసిగ్గా మలయాళీ యాక్టర్.ఆయన నుంచి తెలుగులో వచ్చిన దళపతి,స్వాతి కిరణం,యాత్ర లాంటి మూవీస్ తో టాలీవుడ్ లో పాపులర్ అయ్యారు. లేటెస్ట్ గా ఈ మాలీవుడ్ మెగాస్టార్ నుంచి బ్రహ్మయుగం(Bramayugam) అనే మూవీ రాబోతుంది.

ఈ బ్రహ్మయుగం మూవీ కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథని మేకర్స్ తెలిపారు. అలాగే ఈ మూవీ నుంచి రిలీజైన థ్రిల్లింగ్ పోస్టర్ ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. డార్క్‌ షేడ్స్‌లో రిలీజ్ చేసిన పోస్టర్​ లో ఒంటరి బంగ్లా..ఆ బంగ్లా ముందు పాముల్లాంటి ఆకారంలా చుట్టూ ఆవరణ..దాని ముందు ఓ వ్యక్తి చేతిలో రగిలే కాగడా..అలాగే ఆ బంగ్లా చుట్టూ చెట్లు,భారీ కొండలు, పైన భూతాలాంటి వ్యక్తులు ఇలా పోస్టర్ ఎంతో ఇంటెన్సివ్ గా క్రియేట్ చేశారు మేకర్స్. ఫస్ట్ పోస్టర్ తోనే మమ్ముట్టి..ఫ్యాన్స్ లో ఇదొక హారర్ థ్రిల్లర్ అనే ఆరా తీసుకొచ్చారు.

రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని నైట్ షిఫ్ట్ స్టూడియోస్(Night Shift Studios), వై నాట్ స్టూడియో( YnotStudio) బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంకా ఈ సినిమాలో అర్జున్ అశోకన్​, సిద్ధార్థ్​ భరతన్​, అమల్దా లిజ్​ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షెహ్నాద్​ జలాల్​ సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరిస్తున్నారు. జోతిశ్ శంకర్​ ప్రొడక్షన్ డిజైనర్​గా, షాఫిక్ మహ్మద్​ అలీ ఎడిటర్​గా, క్రిస్టో క్రిస్టో అల్మావీ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. టీడీ రామకృష్ణన్​ డైలాగ్స్​ను అందిస్తున్నారు. 

బ్రహ్మయుగం సినిమా షూటింగ్ కొచ్చి, ఒట్టపాలెంలో భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నిర్మాత చక్రవర్తి రామచంద్ర ప్రొడక్షన్ లో రాబోతున్న ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమా వరల్డ్ వైడ్​గా తెలుగు, మలయాళ, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 2024లో విడుదల కానుంది.