కండిషన్స్ మధ్య మెహర్ కొత్త సినిమా.. ఛాన్స్ ఇచ్చిన బడా నిర్మాణ సంస్థ

కండిషన్స్ మధ్య మెహర్ కొత్త సినిమా.. ఛాన్స్ ఇచ్చిన బడా నిర్మాణ సంస్థ

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఐదు భారీ సినిమాలు తీసి.. ఒక్క హిట్టు కూడా కొట్టని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది మెహర్ రమేష్(Meher Ramesh) అనే చెప్పాలి. అందులో ప్రభాస్(Prabhas), ఎన్టీఆర్(NTR), వెంకటేష్(Venkatesh), చిరంజీవి(Chiranjeevi) వంటి స్టార్ హీరోలు ఉన్నారు. అయినా కూడా మనోడికి ఒక్క హిట్టు కూడా పడలేదు. అందుకే మెహర్ రమేష్ ను ఫ్లాప్స్ కి కేరాఫ్ అంటారు ఆడియన్స్. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో తీసిన భోళా శంకర్ కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇక టాలీవుడ్ లో మెహర్ రమేష్ హిట్టు కొట్టడం కష్టమే అని, దర్శకుడిగా అతని పనైపోయింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భోళా డిజాస్టర్ తరువాత మెహర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

తాజాగా మెహర్ రమేష్ తరువాతి సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒక టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మెహర్ రమేష్ కు మరి ఛాన్స్ ఇచ్చిందట. అయితే ఈ ప్రాజెక్టు కోసం కొన్ని కండీషన్స్ పెట్టిందట ఆ సంస్థ. అవేంటంటే.. ఈ ప్రాజెక్టు ను కేవలం ఐదు కోట్లతో, అది కూడా అంతా కొత్తవారితో తెరకెక్కించాలట. దానికి మెహర్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు స్టార్ హీరోలతో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న మెహర్.. ఈసారి తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి తన సత్తాను చాటాలనుకుంటున్నాడట. ఇందుకోసం ఈ ప్రాజెక్టు ను ఒక చాలెంజింగ్ గా తీసుకున్నాడట మెహర్.

ఈ ప్రాజెక్టు కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. అయితే మెహర్ రమేష్ కు మరో ఛాన్స్ ఇచ్చిన ఆ బడా నిర్మాణ సంస్థ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్స్.. మెహరన్న కనీసం ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.