సైకలాజికల్  స్పార్క్

సైకలాజికల్  స్పార్క్

ఓ వైపు ‘ఎఫ్‌‌‌‌‌‌‌‌3’ లాంటి కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే కొత్త వారితోనూ జోడీ కడుతోంది మెహ్రీన్. విక్రాంత్ అనే బిజినెస్‌‌‌‌‌‌‌‌మెన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది.  ‘స్పార్క్’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కనున్న ఈ సినిమాని  నిన్న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సురేందర్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌‌‌‌‌‌‌, ఎంపీ రంజిత్ రెడ్డి హాజరై టీమ్‌‌‌‌‌‌‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. సినిమాటోగ్రాఫర్  అరవింద్ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. డైరెక్షన్‌‌‌‌‌‌‌‌తో పాటు  కెమెరామేన్‌‌‌‌‌‌‌‌ కూడా ఆయనే.  రెగ్యులర్ షూటింగ్‌‌‌‌‌‌‌‌ను  అతి త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు.   మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టార్ట్ చేసి, తర్వాత వైజాగ్, డార్జిలింగ్, ముంబై, గోవాలతో పాటు ఫారిన్ లోనూ షూట్ చేస్తారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. వెన్నెల కిషోర్‌‌‌‌‌‌‌‌, సత్య, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ అయ్యంగార్‌‌‌‌‌‌‌‌, అన్నపూర్ణమ్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్‌‌‌‌‌‌‌‌  మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సంగీతం అందించనున్నాడని, ఆ పేరును త్వరలోనే  రివీల్ చేస్తామన్నారు. డెఫ్‌‌‌‌‌‌‌‌ ఫ్రాగ్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.