
ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించారు. దీంతో ఓటమి పాలైన ట్రంప్ గురించి ఓ వార్త నేషనల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ట్రంప్ కు తన ఇద్దరు భార్యలైన ఇవానా, మార్లా తరువాత 2005లో 2005లో స్లోవేయిన్-అమెరికన్ మోడల్ మెలానియాను మూడో పెళ్లి చేసుకున్నారు. తాజాగా ట్రంప్ ఓటమితో మెలానియా ట్రంప్ కు విడాకులు ఇస్తున్నట్లు డెయిలీమెయిల్ కథనాన్ని ప్రచురించింది. డెయిలీ మెయిల్ కథనం ప్రకారం.. వైట్ హౌజ్ కమ్యూనికేషన్స్ మాజీ డైరెక్టరే కాకుండా మెలానియా మనసెరిగిన ఒమారసా న్యూమన్..ఆమె అనూహ్యంగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతేకాదు ట్రంప్ – మెలానియాల 15ఏళ్ల వైవాహిక జీవితం ముగుస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు ట్రంప్ ఓటమి ఖరారైంది కాబట్టి ఆమె విడాకులు తీసుకోవచ్చు. అలా కాకపోతే ట్రంపే ఆమెను ఏదోరకంగా ఇబ్బంది పెడతాడని తెలిపింది.
మరోవైపు 2016ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడని మెలానియా ఊహించలేదని చెప్పిన ఒమారసా..ట్రంప్ గెలుపుతో ఆమె కన్నీటి పర్యంతరమైందని అందుకే కొన్ని రోజుల పాటు వైట్ హౌజ్ వైపు కన్నెత్తి చూడలేదని వెల్లడించింది. కొడుకు బారోన్ ట్రంప్ చదువు కోసం ఫ్లోరిడాలోనే ఉండి, ఆలస్యంగా వాషింగ్టన్ వెళ్లారని మెలానియా సన్నిహితురాలు ఒకరు చెప్పిన అభిప్రాయాన్ని కూడా డెయిలీ మెయిల్ ప్రస్తావించింది.