
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు. ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, తాను ఓటమిని అంగీకరించనని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లిన ఆయనకు చుక్కెదురయ్యింది. దీంతో ట్విటర్ వేదికగా ట్రంప్ న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ట్రంప్ తన ఓటమిని అంగీకరించి, వైట్‌హౌస్‌ను ఖాళీ చేయాల్సిందిగా సన్నిహితులు సూచిస్తున్నారు. పరాజయాన్ని అంగీకరించాలని ఆయన అల్లుడు కుష్నర్ కూడా ట్రంప్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఇక ట్రంప్ భార్య మెలానియా గౌరవప్రదంగా వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్దామని ట్రంప్‌ను కోరినట్లు సమాచారం. ఎన్నికల్లో అవకతవకలపై ట్విట్టర్ వేదికగా వైట్ హౌస్ అధికారిక అకౌంట్ నుంచి మెలానియా పలు ట్వీట్లు చేయడం గమనార్హం.