#Melodi : ఇటలీ పీఎంతో మోదీ సెల్ఫీ.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్

#Melodi : ఇటలీ పీఎంతో మోదీ సెల్ఫీ.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్

ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోనికి ఇంటర్నెట్ కల్చర్ గురించి బాగా తెలుసు. అయితే ఆమె రీసెంట్ గా తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన భారతీయ కౌంటర్ నరేంద్ర మోదీతో సెల్ఫీని పంచుకున్నారు. ప్రధాని మోదీతో మెలోని సెల్ఫీ 70.3K పోస్ట్‌లతో Xలో ట్రెండింగ్‌లో ఉన్న 'మెలోడి' హ్యాష్‌ట్యాగ్‌తో ఇంటర్నెట్‌ను బ్రేక్ చేసింది.

COP28 సమ్మిట్ సందర్భంగా దుబాయ్‌లో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. 46 ఏళ్ల ఇటాలియన్ నాయకురాలు తన ఇన్‌స్టాగ్రామ్, X ఖాతాలో పీఎం మోదీతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది. '#Melodi' అనే హ్యాష్‌ట్యాగ్‌తో COP28లో మంచి స్నేహితులు అని దీనికి క్యాప్షన్ గా జోడించింది. Melodi అనేది.. ఇద్దరు నేతల ఇంటి పేర్లను కలిపి హ్యాష్‌ట్యాగ్‌గా రూపొందించారు.

ప్రధాని మోదీ.. ఇటలీ ప్రధానితో దిగిన సెల్ఫీని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ  పోస్ట్‌కి 13.5మిలియన్ల వ్యూస్, 2లక్షలకు పైగా లైక్‌లు, 12వేల కామెంట్స్, 40 రీట్వీట్‌లు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు యష్‌రాజ్ ముఖాటే రూపొందించిన వైరల్ ట్రెండింగ్ రీల్ 'జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్'ని దీనికి క్యాప్షన్ గా పెట్టగా, మరికొందరు వీరిపై మీమ్స్ ను క్రియేట్ చేశారు.